కలెక్టర్ ప్రజావాణిలో 83 వినతులు
GDWL: జిల్లా కేంద్రంలోని ఐడీవోసీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 83 ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు, ఆర్డీవో శ్రీనివాసరావు ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణిలో వచ్చిన ప్రతి సమస్యను అధికారులు బాధ్యతగా తీసుకుని త్వరితగతిన పరిష్కరించాలన్నారు.