ఆత్మకూరులో వికలాంగుడు వరదల్లో గల్లంతు

NDL: బండి ఆత్మకూరులోని కుందూ నదిపై బుధవారం విషాదకర సంఘటన చోటుచేసుకుంది. వరద ప్రవాహం ఎక్కువగా ఉన్న బ్రిడ్జిపై ట్రై సైకిల్‌తో వెళ్తున్న రమణారెడ్డి అనే వికలాంగుడు ప్రమాదవశాత్తు నీటిలో కొట్టుకుపోయి గల్లంతయ్యారు. ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, గల్లంతైన రమణారెడ్డి కోసం సహాయక చర్యలు చేపట్టారు.