అక్రమ మైనింగ్‌పై సీబీసీఐడీ విచారణకు సీఎం ఆదేశం
HYD: శాసనసభ వేదికగా అక్రమ మైనింగ్‌పై సీఎం రేవంత్ రెడ్డి సీబీసీఐడీ విచారణకు ఆదేశించారు. నేరేళ్ల ఇసుక మాఫియాపై, శిరీషా, జియో గ్రానైట్ మైనింగ్‌పై, మిడ్ వెస్ట్ గ్రానైట్‌పై, శ్వేత గ్రానైట్, తదితర వాటిపై విచారణ జరిపించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఆరోపణలు చేసిన అన్నిటిపై సీబీసీఐడీ విచారణకు ఆదేశిస్తున్నామని, విచారణలో నిజాలు తేలుస్తామని పేర్కొన్నారు.