గువ్వల చేరికతో అంతర్మథనంలో మాజీ ఎంపీ

NGKL: అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఇటీవల బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. దీంతో బీజేపీలో ఉన్న మాజీ ఎంపీ పోతుగంటి రాములు, ఆయన కుమారుడు భరత్ రాజకీయ భవిష్యత్తుపై చర్చ జరుగుతోంది. గతంలో వీరిద్దరి మధ్య తీవ్ర విభేదాలుండేవి. ఇప్పుడు ఒకే పార్టీలో కలిసి ఉంటారా, లేక ఇతర పార్టీల వైపు చూస్తారా అని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.