టెక్కలిలో 26న జిల్లా స్థాయి చెస్ పోటీలు
SKLM: టెక్కలిలో ఈనెల 26న జరగనున్న జిల్లా స్థాయి ఓపెన్ చదరంగం పోటీలకు సంబందించిన బ్రోచర్‌ను మంగళవారం టెక్కలి ఆర్డీవో ఆవిష్కరించారు. ఈ మేరకు చెస్ ఫెడరేషన్ సభ్యుల ఆధ్వర్యంలో ఆయన బ్రోచర్‌ను ఆవిష్కరించారు. స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ పాఠశాలలో ఈ చెస్ పోటీలు జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో చెస్ ఫెడరేషన్ సభ్యులు భీమారావు, అవినాష్ ఉన్నారు.