వరుడే.. యముడై..
తాళి కట్టాల్సిన వరుడే యముడైన ఘటన గుజరాత్ భావ్ నగర్‌లో జరిగింది. సాజన్ బరయ్య అనే యువకుడికి సోని రాథోడ్ అనే యువతితో శనివారం రాత్రి వివాహం జరగాల్సి ఉంది. అయితే పెళ్లికి గంట ముందు చీర, డబ్బు విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన సాజన్ సోనిపై ఇనుప రాడ్డుతో దాడి చేశాడు. దీంతో ఆమె మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.