మన 'గిల్లీ దండా' స్పెయిన్‌లో ఫేమస్
మన చిన్ననాటి ఆట 'గిల్లీ దండా' స్పెయిన్‌లో రచ్చ చేస్తోంది. అక్కడ దీన్ని 'బిల్లార్డా'(Billarda) అని పిలుస్తారు. గాలీషియా ప్రాంతంలో ఈ సంప్రదాయ ఆటను కాపాడుకునేందుకు ఏకంగా లీగ్స్ నిర్వహిస్తున్నారు. పిల్లలకు ప్రత్యేకంగా నేర్పిస్తున్నారు. మన దగ్గర కనుమరుగైన ఈ ఆట.. విదేశాల్లో దర్జాగా వెలుగుతుండటంతో ఆ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.