VIDEO: ముంపు ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే
HNK: మొంథా తుఫాను కారణంగా నగరంలో ముంపు గురైన ప్రాంతాల్లో శుక్రవారం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పర్యటించారు. 56వ డివిజన్ పరిధిలోని వివేక్ నగర్, అమరావతి నగర్, శాంతినగర్ తదితర కాలనీల ప్రస్తుత పరిస్థితులను అధికారుల బృందంతో కలిసి పరిశీలించారు. అనంతరం కాలనీ వాసులతో మాట్లాడారు. ప్రజలు ఆందోళన చెందకూడదు. ప్రభుత్వం మీతో ఉంది అని భరోసా ఇచ్చారు.