ఈ ప్రాంతంలో ఎప్పుడు ట్రాఫిక్ జామ్ కారణం ఇదే
SRCL: వేములవాడ పట్టణంలోని కోరుట్ల బస్టాండ్ ప్రాంతంలో ప్రతి రోజు ఉదయం ట్రాఫిక్ జామ్ సమస్య తలెత్తుతోంది. దీనికి అసలు కారణం ఏమిటంటే.. ప్రతిరోజు వేకువ జామున కోరుట్ల బస్టాండ్ ప్రాంతంలోని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ చౌరస్తా చుట్టూ కూరగాయల చిరు వ్యాపారాలు రోడ్డుపైనే అమ్మకాలు జరపడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందని స్థానిక ప్రజలు, వాహనదారులు చెబుతున్నారు.