రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

E.G: కొవ్వూరు మండలం కాపవరం వద్ద బుధవారం రాత్రి రెండు బైక్‌లు ఢీకొన్న ఘటనలో అల్లం గణేశ్ మృతి చెందారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని కొవ్వూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రెల్లిపేటకు చెందిన నలుగురు యువకులు ఐపంగిడి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని ఎస్సై కే. శ్రీహరిరావు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.