రవాణా శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు

రవాణా శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు

మన్యం: పార్వతీపురం కూడలిలో జిల్లా రవాణా శాఖ అధికారి దుర్గాప్రసాద్ రెడ్డి నేతృత్వంలో బుధవారం వాహన తనిఖీలు నిర్వహించారు. పరిమితి మించి ప్రయాణికులతో ప్రయాణిస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించారు. రహదారి భద్రతా నియమాలు ఉల్లంఘించిన 10 ఆటోలపై కేసులు నమోదు చేసి, మూడు ఆటోలను సీజ్ చేశామని చెప్పారు. సుమారు రూ.55 వేలు జరిమానా విధించినట్లు తెలిపారు.