బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి

MLG: గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామానికి చెందిన గుంట చిన్నన్న ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి సీతక్క మృతుడి ఇంటికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరమర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, కార్యకర్తలు ఉన్నారు.