భూభారతి దరఖాస్తులు పరిష్కరించండి: కలెక్టర్
GDWL: మానవపాడు తహశీల్దార్ కార్యాలయాన్ని గద్వాల కలెక్టర్ సంతోష్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలోని దస్త్రాలను పరిశీలించినప్పుడు 60 భూభారతి, 508 సాదాబైనామ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించారు. వీటిని త్వరితగతిన పరిష్కరించకుండా పెండింగ్‌లో ఉంచవద్దని ఆయన తహశీల్దార్ జోషి శ్రీనివాస శర్మను ఆదేశించారు.