సంప్రదాయబద్ధంగా కార్తీక వన సమారాధనోత్సవం
NDL: ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రకృతి మాతను ఆరాధిస్తూ కార్తీక వన సమారాధనను ఘనంగా జరుపుకున్నారు. మన సంప్రదాయ సంస్కృతిలో అంతర్భాగమని కలెక్టర్ జి. రాజాకుమారి అన్నారు. ఇవాళ డోన్ నగరవనంలో అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక వన సమారాధనోత్సవం సంప్రదాయ బద్ధంగా నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్, అధికారులు కలిసి నగరవనంలోని ఉసిరిక వృక్షానికి పూజలు చేసినట్లు తెలిపారు.