VIDEO: పర్వతగిరిలో ఆగని మొరం దందా..!
WGL: పర్వతగిరి మండలంలోని వివిధ గ్రామాల్లో చిన్న మట్టి గుట్టల వద్ద అక్రమ మట్టి తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. గుర్తుతెలియని వ్యక్తులు మట్టిని తరలించి లక్షల్లో ఆర్జిస్తున్నారని, సహజ వనరులు నాశనమవుతున్నాయని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మొరం దందాను వెంటనే అరికట్టి, అక్రమార్కులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.