వసతి గృహాలు తనిఖీ చేసిన కలెక్టర్

వసతి గృహాలు తనిఖీ చేసిన కలెక్టర్

CTR: బంగారుపాళ్యంలోని పలు ప్రభుత్వ వసతి గృహాలను కలెక్టర్ సుమిత్ కుమార్ కస్మికంగా తనిఖీ చేశారు. ఎస్సీ, బీసీ, సాంఘిక సంక్షేమ శాఖలకు చెందిన బాలికల వసతి గృహాలను, సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహాన్ని కలెక్టర్ సందర్శించారు. ఇందులోని విద్యార్థుల హాజరు నమోదు, స్టాక్ రిజిస్టర్లను తనిఖీ చేశారు. భోజన సౌకర్యాలు, వసతి, పారిశుద్ధ్య వివరాలను ఆరా తీశారు.