'డిజిటల్ విధానంలో వివరాలు నమోదు'
KNR: జనగణన అధికారుల ప్రమేయం లేకుండానే ఇంట్లో నుండే డిజిటల్ విధానంలో సొంతంగా ప్రతి ఒక్కరూ జనగణన వివరాలను నమోదు చేసుకునే అవకాశం కేంద్ర ప్రభుత్వం కల్పిస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. ఈనెలలో ప్రారంభమైన జనగణనలో భాగంగా తొలిదశలో హౌజ్ లిస్టింగ్ (ఇంటి వివరాలు), హౌజింగ్ సెన్సెస్ (ఇంట్లోని సౌకర్యాల) వివరాలను నమోదు చేసుకోవాలని కోరారు.