సీఎం సహాయ నిధి అందజేసిన ఎమ్మెల్యే

WNP: మదనపురం మండల కేంద్రానికి చెందిన బోయ శ్రీహరి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. గుండె ఆపరేషన్ చేయాలని వైద్యులు తెలుపగా, ఈ విషయాన్ని స్థానిక కాంగ్రెస్ నాయకుల ద్వారా దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తెలుసుకుని మెరుగైన చికిత్స కోసం బాధిత కుటుంబానికి రూ. 5 లక్షల విలువైన సీఎం సహాయ నిధి చెక్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.