'పోలీసులపై చర్యలు తీసుకోవాలి'

'పోలీసులపై చర్యలు తీసుకోవాలి'

SRD: జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో దివ్యాంగుని ఈడ్చికెళ్లిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర కార్యదర్శి ఆడివయ్య మంగళవారం డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రజా పాలన నడుస్తుందని చెబుతున్న ప్రభుత్వం దివ్యాంగులపై చిన్న చూపు చూస్తుందని ఆరోపించారు. ఈ ఘటనకు కారణం అయిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.