డ్రాయింగ్స్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్

డ్రాయింగ్స్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్

WGL: ప్రపంచ అరణ్య దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌లో ప్రభుత్వ హోస్టల్స్, పాఠశాలల విద్యార్థులు నిర్వహించిన చిత్రలేఖన ప్రదర్శనను జిల్లా కలెక్టర్ డా. సత్య శారద వీక్షించారు. విద్యార్థుల ప్రతిభను అభినందిస్తూ, పర్యావరణ పరిరక్షణలో అరణ్యాల ప్రాధాన్యతను వివరించారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ జిల్లా అధికారి పాల్గొన్నారు.