ప్రజా సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు: ఎస్పీ
సత్యసాయి: ప్రజా సమస్యల పరిష్కారానికి పోలీసులు సత్వర చర్యలు చేపట్టాలని ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక' కార్యక్రమంలో ఎస్పీ స్వయంగా ప్రజల నుంచి 66 అర్జీలను స్వీకరించారు. అర్జీలపై ఎస్పీ వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్‌లో మాట్లాడి తక్షణ పరిష్కారం కోసం సూచించారు.