తుక్కుగూడ సభను విజయవంతం చేయండి

రంగారెడ్డి: ఏప్రిల్ 6వ తేదీన జరగనున్న కాంగ్రెస్ సభను విజయవంతం చేయాలని చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని తుక్కుగూడలో వచ్చేనెల ఆరవ తేదీన జరగనున్న సమావేశపు ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జాతీయ కాంగ్రెస్ రూపొందించిన గ్యారెంటీలను ప్రకటించనున్నారని చెప్పారు.