పెనుమంట్రలో విద్యార్థులకు వైద్య పరీక్షలు

పెనుమంట్రలో విద్యార్థులకు వైద్య పరీక్షలు

W.G: పెనుమంట్రలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం వైద్య సిబ్బంది విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. విద్యార్థులకు హిమోగ్లోబిన్ శాతాన్ని పరీక్షించి, ఎత్తు, బరువు కొలిచారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేస్తామని ఏఎన్ఎం భాగ్యకుమారి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశా సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.