'ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బందులు రాకూడదు'

'ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బందులు రాకూడదు'

SRPT: ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని నూతనకల్ తహశీల్దార్ శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. ఎంపీడీవో, ఏపీఎం, కొనుగోలు కేంద్రాల ఇన్‌ఛార్జీలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పలు సూచనలు చేశారు. రైతులు తీసుకొచ్చే ధాన్యాన్ని రిజిస్టర్‌లో నమోదు చేయాలని, తేమ శాతం 17 శాతం మించకుండా ఉండేలా అవగాహన కల్పించాలని సూచించారు.