'తక్కువ పరిహారం ఇచ్చి రైతులకు అన్యాయం చేశారు'

VZM: మార్కెట్ విలువ కంటే తకువ పరిహారం ఇచ్చి బొడ్డవర పంచాయతీలో రైతులకు అన్యాయం చేశారని MLC ఇందుకూరి రఘురాజు అన్నారు. ఎస్. కోట మండల పరిషత్‌లో గురువారం జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. 2007-08లో జిందాల్ భూములు కొనుగోలు విషయంలో నష్టపరిహారం చెల్లింపుల్లో అనేక అవకతవకలు జరిగాయని ఆరోపించారు.