ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేత

SKLM: ఇచ్చాపురం ఎమ్మార్వోకు గురువారం వినతిపత్రం అందజేసినట్లు విశ్రాంతి ఉద్యోగుల ఉపాధ్యాయ అధ్యక్షులు కె.మోహన్ రావు రెడ్డి, కార్యదర్శి వి.కేశవరావు సభ్యులు తెలిపారు. విశ్రాంతి ఉద్యోగుల సమావేశ భవనం నిర్మాణానికి స్థలం కేటాయించాలని కోరినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇచ్చాపురం మున్సిపాలిటీ పరిధి 11వ వార్డు కౌన్సిలర్ ఆశి లీలారాణి తదితరులు పాల్గొన్నారు.