లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోవాలి: ఎస్పీ

లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోవాలి: ఎస్పీ

NRPT: నారాయణపేట, మక్తల్, కోస్గి కోర్టులలో ఈ నెల 28న జరిగే జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్  ఒక ప్రకటనలో తెలిపారు. రాజీ మార్గమే ఉత్తమ మార్గమని, పట్టింపులకు పోకుండా రాజీ మార్గం ద్వారా లోక్ అదాలత్‌లో కేసులను మాఫీ చేసుకోవాలని ఆయన కోరారు. రాజీ చేసుకునే వారు స్థానిక పోలీసులను సంప్రదించాలని సూచించారు.