వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు

వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు

ప్రకాశం: కనిగిరిలోని వైసీపీ కార్యాలయంలో రాఖీ పౌర్ణమి వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. మహిళలు కనిగిరి నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్‌ను కలిసి, రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నారాయణ యాదవ్ మాట్లాడుతూ... అన్నా, చెల్లెళ్ల అనురాగానికి ప్రతీక రాఖీ పండుగ అని, నియోజకవర్గ వ్యాప్తంగా సుఖసంతోషాలతో రాఖీ పండుగను ఘనంగా జరుపుకోవాలని అన్నారు.