VIDEO: 'రాయచోటి పోతే రాజీనామా చేస్తా'
అన్నమయ్య: జిల్లా కేంద్రంగా రాయచోటి కొనసాగుతుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడి నుంచి తరలించబోమని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. రాయచోటిని తరలిస్తే తాను రాజీనామా చేయడానికి కూడా సిద్ధమని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే టికెట్ కోసం ఎంత కష్టపడ్డానో, రాయచోటిని కాపాడటానికి కూడా అంతే కృషి చేస్తున్నానని తెలిపారు.