గోదావరిలో దూకి మహిళ ఆత్మహత్యాయత్నం
కోనసీమ: యానాం-ఎదురులంక వంతెనపై సోమవారం ఉదయం గోదావరిలో దూకి ఒక మహిళ ఆత్మహత్యాయత్నంకి పాల్పడింది. గోదావరిలో నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఆమెను అక్కడే చేపల వేట సాగిస్తున్న జాలర్లు చాకచక్యంగా కాపాడి ఒడ్డుకు చేర్చారు. మహిళ ప్రాణాలను కాపాడిన జాలర్లను స్థానికులు అభినందించారు. మహిళ వివరాలు తెలియాల్సి ఉంది.