రోడ్డుకు అడ్డంగా విరిగిపడిన భారీ చెట్టు కొమ్మలు

SKLM: జిల్లా వ్యాప్తంగా చాలాచోట్ల బుధవారం సాయంత్రం భారీ ఈదురు గాలులతో వర్షం కురిసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఎల్ఎన్ పేట మండలం మల్లికార్జునపురం గ్రామం వద్ద అలికాం -బత్తిలి రోడ్డు పై భారీ చెట్టు కొమ్మలు విరిగి పడడంతో కొంతమేర వాహనదారులకు అసౌకర్యం ఏర్పడింది. వర్షం కారణంగా ఆ సమయంలో వాహనదారులు ఎవరు వెళ్లకపోవడంతో ప్రమాదం తప్పింది.