శ్రీ శారదా పీఠంలో ఘనంగా సామూహిక అక్షరాభ్యాసం
VSP: పెందుర్తిలోని విశాఖ శ్రీ శారదా పీఠంలో వసంత పంచమి సందర్భంగా వార్షిక మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమంలో వందలాది చిన్నారులు పాల్గొన్నారు. శారదా అమ్మవారి సన్నిధిలో తొలి అక్షరాలు దిద్దించేందుకు తల్లిదండ్రులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.