డిజిటలైజేషన్ కోర్సు శిక్షణకు ఎంపికైన ABDM డైరెక్టర్

AP: ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ABDM) డైరెక్టర్ వీరపాండియన్ డిజిటలైజేషన్ కోర్సు శిక్షణకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా వీరపాండియన్‌ను మంత్రి సత్యకుమార్ అభినందించారు. వీరపాండియన్‌తో పాటు మరో ముగ్గురిని శిక్షణకు ఎంపిక చేసినట్లు కేంద్రం ప్రకటించింది. ఎంపికైన వారు అక్టోబర్ 1 నుంచి 31 వరకు డెన్మార్క్‌లో డిజిటలైజేషన్ కోర్సు శిక్షణ పొందనున్నారు.