'యువతరాన్ని డ్రగ్స్ నుంచి కాపాడండి'

ELR: జిల్లాను డ్రగ్స్ రహితంగా మార్చాలని, యువతరాన్ని కాపాడాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సూర్యకిరణ్ డిమాండ్ చేశారు. శుక్రవారం జంగారెడ్డిగూడెంలోని బాబు జగ్జీవన్ రావ్ విగ్రహానికి డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. అనంతరం సూర్యకిరణ్ మాట్లాడుతూ.. డ్రగ్స్ మాఫియాను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు.