'ప్రభుత్వ సేవలపై ప్రజల్లో సంతృప్తి పెరగాలి’

KDP: ప్రభుత్వ సేవలపై ప్రజా స్పందనల సంతృప్తి స్థాయిని పెంపొందించే విధంగా పురోగతి సాధించాలని ఇంఛార్జ్, కలెక్టర్ JC అదితి సింగ్ అన్ని శాఖల జిల్లా అధికారులకు సూచించారు. రాష్ట్ర రాజధాని అమరావతి నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత అధికారులతో పలు అంశాలపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి విజయానంద్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు.