'వెంటనే సహాయక చర్యలు చేపట్టాలి'

SRPT: ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా సంబంధిత శాఖలు సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆదేశించారు. మంగళవారం తిరుమలగిరి మండలం తొండలో 180 మిల్లీమీటర్ల వర్షం కురవడంతో వరద ప్రభావిత లోతట్టు ప్రాంతాల్లో పర్యటించారు. వరద నీరు చెరువులోకి వెళ్లేలా ఎక్కువ మిషనరీ ఉపయోగించి అడ్డంకులను తొలగించాలన్నారు.