కస్తూర్బా గాంధీ పాఠశాలను సందర్శించిన ఆర్డీవో

కస్తూర్బా గాంధీ పాఠశాలను సందర్శించిన ఆర్డీవో

ప్రకాశం: కనిగిరిలోని స్థానిక కస్తూర్బా గాంధీ పాఠశాలను శుక్రవారం ఆర్డీవో కేశవర్ధన్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులు చేసిన వివిధ రకాల వస్తువులు పరిశీలించారు. అనంతరం పాఠశాలలోని వంటశాలను పరిశీలించారు. పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఆర్డీవోతో పాటు ఎంఈఓ నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.