'మార్చి 31లోపు పన్నులు చెల్లించాలి'
ASF: కాగజ్‌నగర్ పట్టణంలో ప్రజల సౌకర్యార్థం ఆస్తి పన్ను, నీటి పన్ను చెల్లింపునకు ప్రత్యేక మున్సిపల్ సంస్థలు ప్రత్యేక కౌంటర్లను ఆదివారం సిద్ధం చేశారు. 2025-26 ఆర్ధిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ బి. తిరుపతి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు పట్టణ ప్రజలు మార్చి 31లోపు పన్నులు చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని అధికారులు కోరుతున్నారు.