VIDEO: శ్రీవారి సేవలో సినీనటి రాశీ సింగ్

TPT: ప్రముఖ సినీనటి రాశీ సింగ్ తన స్నేహితులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకులు వేద ఆశీర్వచనంతో తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల ఆమెతో అభిమానులు, భక్తులు ఫోటోలు దిగారు. ప్రముఖ నిర్మాత బన్నీ వాసు సైతం శ్రీవారిని దర్శించుకున్నారు.