'కంటిచూపు పరీక్షలు చేసుకోవాలి'
విజయనగరంలో జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల సందర్బంగా జిల్లా ఉప రవాణా కమిషనర్ మణికుమార్ ఆధ్వర్యంలో గురువారం వాహనచోదకులకు కంటిచూపు పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కంటిచూపు సరిగ్గా లేకపోవడం వలన ఎదురుగా వచ్చే వాహనాలు కనబడక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయన్నారు. వాహనచోదకులు విధిగా కంటిచూపు పరీక్షలు చేసుకోవాలని కోరారు.