రెండు రోజులు పాటు రిలే నిరాహార దీక్షలు

నెల్లూరు: ఉదయగిరి ఆర్టీసీ డిపో ఎదుట ఈనెల 28, 29 తేదీలలో రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ (APPTD) తెలిపారు. ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగ, కార్మికుల సమస్యల పరిష్కారానికి ఈ రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ రిలే నిరాహార దీక్షలకు ప్రతి ఒక్కరూ రావాలని పిలుపునిచ్చారు.