టేకులపల్లి మోడల్ స్కూల్‌ను సందర్శించిన కవిత

టేకులపల్లి మోడల్ స్కూల్‌ను సందర్శించిన కవిత

KMM: జిల్లాలోని టేకులపల్లి మోడల్ స్కూల్‌ను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సోమవారం సందర్శించారు. ప్రభుత్వ హాస్టల్స్‌లో విద్యార్థులకు కనీస వసతులు లేవని కవిత అసంతృప్తి వ్యక్తం చేశారు. హాస్టల్ భవనం ప్రమాదకరంగా మారి విద్యార్థులకు భధ్రత లేని పరిస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్రంలోని ఏ జిల్లా పర్యటనకు వెళ్లినా హాస్టళ్ల నిర్వహణ ఎంత అధ్వాన్నంగా ఉందో అర్థమవుతుందన్నారు.