మహిళలకు GOOD NEWS

మహిళలకు GOOD NEWS

TG: ఇవాళ ఉ.11 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు వడ్డీలేని రుణాల పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ రుణాల పంపిణీ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. మొత్తం రూ.304కోట్ల వడ్డీలేని రుణాలను అందించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఈ పథకం ద్వారా 3,57,098 స్వయం సహాయక సంఘాల ఖాతాల్లో డబ్బులు జమకానున్నాయని పేర్కొన్నారు.