యూరియా కోసం రైతుల ఇబ్బందులు

యూరియా కోసం రైతుల ఇబ్బందులు

MHBD: జిల్లాలో రైతులు యూరియా ఎరువుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బయ్యారం రైతు వేదికలో శుక్రవారం టోకెన్లు పంపిణీకి రైతులు తెల్లవారుజామున చేరుకున్నారు. పొడవాటి క్యూలైన్లలో నిలబడి పడిగాపులు కాస్తున్నారు. పంటలకు సకాలంలో యూరియా లేకపోతే దిగుబడి తగ్గుతుందని ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి పంపిణీ చేయాలని కోరుతున్నారు.