గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
W.G: తణుకు గోస్తనీలో శుక్రవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సుమారు 40 నుంచి 45 సంవత్సరాలు వయసు కలిగిన వ్యక్తి మృతదేహం స్థానిక పెద్ద వంతెన సమీపంలో తేలియాడడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పట్టణ పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. మృతుడి చేతిపై కృష్ణవేణి అనే పేరు ఉంది.