చీమకుర్తిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం
ప్రకాశం: చీమకుర్తి మండలంలో ఇవాళ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. నిప్పట్లపాడు విద్యుత్ ఉపకేంద్రంలో నిర్వహణ పనుల కారణంగా ఉదయం 7 నుంచి 1 గంటల వరకు బక్కి రెడ్డిపాలెం, ఓబచెత్తపాలెం, దేవరపాలెం, నిప్పట్లపాడు గ్రామాలలో విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. డీఈ. ఈ. మోహనరావు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.