తొలగనున్న కేజీబీవీ విద్యార్థుల కష్టాలు
VKB: జిల్లాలోని కస్తూరిబా గాంధీ విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థుల ఇబ్బందులు తొలగనున్నాయి. చలికాలంలో విద్యార్థులకు సరిపడా బెడ్‌లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. దీంతో 17 KGBVలకు 2,748 బెడ్‌లు కావాలని జిల్లా ఉన్నతాధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని 12 KGBVలకు ప్రభుత్వం 2,130 బెడ్‌లు మంజూరు చేసింది.