ఆళ్లగడ్డలో పోలీస్ యాక్ట్ అమలు: డీఎస్పీ
NDL: ఆళ్లగడ్డ సబ్ డివిజన్ పరిధిలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున ర్యాలీలు, సమావేశాలు, ప్రోసెషన్స్‌కు ఎటువంటి అనుమతులూ లేవని DSP ప్రమోద్ తెలిపారు. ఎవరైనా సమావేశాలు, ర్యాలీలు చేసుకోవాలంటే కచ్చితంగా పోలీస్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఎవరైనా గుంపులుగా కూడి శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.