ఉచిత కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని వినతి
BHNG: జిల్లాలోని నిరుద్యోగ యువతకు పోటీ పరీక్షల శిక్షణ కోసం ఉచిత కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని AIYF డిమాండ్ చేసింది. సోమవారం కలెక్టరేట్లో జరిగిన 'ప్రజావాణి'లో కలెక్టరుకు వినతిపత్రం అందజేశారు. AIYF జిల్లా అధ్యక్షుడు, కార్యదర్శి ఏల్లంకి మహేష్, మహేందర్ మాట్లాడుతూ.. గ్రామీణ, పేద కుటుంబాలకు చెందిన విద్యావంతులకు ఉచిత కోచింగ్ సెంటర్లు ఉపయోగపడతాయని అన్నారు.