'జన్నారంలో మినీ డిపోను ఏర్పాటు చేయాలి'

'జన్నారంలో మినీ డిపోను ఏర్పాటు చేయాలి'

MNCL: జన్నారం మండల కేంద్రంలో ప్రయాణికుల సౌకర్యార్థం మినీ బస్సు డిపోను ఏర్పాటు చేయాలని మండలవాసులు కోరారు. జన్నారం మండల కేంద్రం నాలుగు జిల్లాలకు వెళ్లే ప్రధాన సరిహద్దులో ఉంది. దీంతో నిత్యం ప్రయాణికులు, వాహనాల రాకపోకలతో రద్దీగా ఉంటుంది. అలాగే జన్నారం బస్టాండ్‌లో మినీ డిపోను ఏర్పాటు చేసేందుకు అవసరమైన స్థలం కూడా అందుబాటులో ఉందని ప్రజలు వెల్లడించారు.